చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి ఎన్టీఆర్ ట్రస్ట్ వితరణతో... ఆక్సిజన్ ప్లాంట్ను అందించారు. స్థానిక ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రూ.45 లక్షల వ్యయంతో ప్లాంట్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఈ క్రమంలో ఇవాళ కుప్పం చేరుకున్న ఆక్సిజన్ ప్లాంట్ కు తెదేపా కార్యాలయం వద్ద పూజలు చేసి పట్టణంలో ఊరేగించారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేతలు అభ్యంతరం చెప్పారు.
ఇదీ చదవండి:
Bjp Mahila Morcha: 'ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు.. కాగితాలకే పరిమితం'