భూమన కరుణాకర్ రెడ్డి....వైకాపా సీనియర్ నేతలలో ఒకరు. 2012లో తిరుపతి ఎమ్మెల్యేగా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌గా పనిచేశారు. ఎవరైనా ఆయన దగ్గరకు వెళ్లి కరచాలనం చేసిందే పాపం..ఇష్టం ఉన్నా లేకున్నా మెడలో కండువా వేయటం....వారితో కలిసి ఫోటోలు దిగటం క్షణాల్లో జరిగిపోతాయి. ఇక్కడితో భూమన స్క్రీన్‌ప్లే అయిపోదు..వైకాపాలో భారీగా చేరికలు అంటూ మరుసటిరోజు పత్రికలో ఉదయాన్నే కలర్ ఫోటోలు దర్శనమిస్తాయి. అంతే ఇక అవాక్కవటం ఆ ప్రజల వంతవుతుంది.
తెదేపా తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారిలో తుడా ఛైర్మన్ నరసింహయాదవ్ ఒకరు. టికెట్ దక్కకపోవటంతో ఓ సమయంలో ఆయన పూర్తి నిరాశకు లోనయ్యారు. స్వయంగా చంద్రబాబు నచ్చజెప్పటంతో తెదేపా అభ్యర్థి సుగుణమ్మకు మద్దుతుగా నిలుస్తున్నారు. ప్రచారంలో భాగంగా నరసింహయాదవ్ మేనల్లుడు రాజా యాదవ్‌ను కలిశారు. నమస్కారం చేసిన కరుణాకర రెడ్డికి తిరిగి ప్రతినమస్కారం చేయగా...దగ్గరకు తీసుకుని ఫోటో దిగారు. ఒక్కసారిగా పార్టీ కండువా సైతం కప్పారు. తర్వాతి రోజు ఉదయాన్నే పత్రికల్లో భూమన ఆధ్వర్వంలో పార్టీలో చేరిన తుడా ఛైర్మన్ మేనల్లుడు అని ప్రచురించారు. పేపర్లో వచ్చిన ఫోటోలు చూసి బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.
కరుణాకరరెడ్డికి ఈ తరహా ప్రచారాలు కొత్తనుకుంటే పొరపాటే. 2014 ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్లి ఓటెయ్యాలని ఓటర్లలతో ప్రమాణాలు చేయించుకొని ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురయ్యారు. ఈసారి మరోకొత్త ఎత్తుగడతో ఇలా సాధారణ ప్రజలను సైతం పార్టీలో చేరినట్లు...తెదేపా కార్యకర్తలు పార్టీ మారినట్లు చూపిస్తున్నారు. భూమన తీరుతో... జనాలు ... నాయకులు అవాక్కవుతున్నారు.