ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో నేలకొరిగిన భారీ వృక్షాలు తొలగించిన సిబ్బంది

నివర్ తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలోని పలుచోట్ల భారీ వృక్షాలు నెలకొరిగాయి. రహదారులపై చెట్లు కూలటం వల్ల వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వృక్షాలను తొలగించి సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు.

author img

By

Published : Nov 26, 2020, 5:49 PM IST

చిత్తూరు జిల్లాలో నేలకొరిగిన భారీ వృక్షాలు

నివర్ తుపాను చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టించింది. పూతలపట్టు, మదనపల్లె, వెదురుకుప్పం, బైరెడ్డిపల్లె ప్రాంతాల్లో తుపాను దాటికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. రహదారులపై చెట్లు కూలటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. అప్రమత్తమైన పోలీసులు వృక్షాలను తొలగించి సహయక చర్యల్లో పాల్గొన్నారు. చెరువులు, కాలువలు తెగిపోయే అవకాశం ఉన్నందున...ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరికైనా సహాయం కావాల్సి వస్తే డయల్ 100 లేదా పోలీసు వాట్సప్ నెంబర్​ 9440900005 కు సమాచారం అందించాలని సూచించారు.

ఇదీచదవండి

బలహీన పడిన 'నివర్'‌- ముమ్మరంగా సహాయక చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.