శేషాచల అటవీప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం భాకరాపేట ఫారెస్ట్ లో టాస్క్ ఫోర్స్ అధికారుల కూంబింగ్ చేపట్టారు. ఓ తమిళనాడుకు చెందిన స్మగ్లర్ను అరెస్ట్ చేసి, 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 700 కేజీల బరువు గల 19 ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.20 లక్షలు ఉంటుందని డీఎస్పీ రవిశంకర్ వెల్లడించారు. స్మగ్లర్లు సహజ సంపదను మూర్ఖంగా నరికి వేస్తున్నారని, పట్టుబడితే శిక్షలు కఠినంగా ఉన్నా వెనుకాడడం లేదని టాస్క్ఫోర్స్ డీఎస్పీ రవిశంకర్ అన్నారు.
భాకరాపేట నుంచి తలకోన వరకు అటవీశాఖ, టాస్క్ఫోర్స్ అధికారులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ రవిశంకర్ తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పిడితే శిక్షలు కఠినంగా ఉంటాయని తెలిసి కూడా స్మగ్లర్లు మూర్ఖంగా బరితెగిస్తున్నారని చెప్పారు. సుమారు20 మంది స్మగ్లర్లు అధికారుల రాకను పసిగట్టి రాళ్ల దాడికి పాల్పడ్డారని అన్నారు. వారిని వెంబడించి ఓక స్మగ్లర్ ను అరెస్ట్ చేశామన్నారు. పరారైన స్మగ్లర్ల కోసం విస్తృతంగా గాలింపులు చేపట్టామని చెప్పారు.
ఇదీ చదవండి: నేర్పాలంటే... నేర్చుకోవాల్సిందే!