చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వెలసిన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారు లక్ష్మిదేవి అలంకరణలో పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు వేకువజామున అభిషేకం నిర్వహించారు. ఆదివారం సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ పడికావలికి తీసుకువచ్చారు. వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలు, బంగారు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించి పెద్ద శేషవాహనంపై అధిష్టింపజేశారు.
ఇదీ చదవండి