ETV Bharat / state

పురపాలక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ..! - చిత్తూరు జిల్లాలో పురపాలక ఎన్నికల న్యూస్

నగర, పురపాలక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం బుధవారంతో ముగిసింది. ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్‌ పెట్టెల్లో నిక్షిప్తం చేశారు. చివరి అంకమైన ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది. పోటాపోటీగా ప్రచారం చేయడంతోపాటు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని వ్యూహాలను అనుసరించిన అభ్యర్థులు..ఈనెల 14న తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

పురపాలక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
పురపాలక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
author img

By

Published : Mar 13, 2021, 3:58 PM IST

చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతోపాటు మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గత ఏడాది నోటిఫికేషన్‌ ఇచ్చింది. గత సంవత్సరం మార్చిలో నామినేషన్ల ఉపసంహరణ రోజు కరోనా కారణంగా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. ఈ ఏడాది మార్చి 2, 3 తేదీల్లో తిరిగి నామపత్రాల ఉపసంహరణకు అనుమతి ఇచ్చారు. 3వ తేదీ సాయంత్రం నాటికి రెండు నగర, అయిదు పురపాలికల్లో కలిపి 130 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అనంతరం హైకోర్టు తీర్పుతో తిరుపతిలో మరో డివిజన్‌లో కూడా అధికార పార్టీ అభ్యర్థి మాత్రమే పోటీలో నిలిచిన పరిస్థితి కనిపించింది. దీంతో ఏకగ్రీవాల సంఖ్య 131కు చేరింది.

వైకాపాకి మూడు పీఠాలు

ఆదివారం వెలువడే ఓటర్ల తీర్పుతో సంబంధం లేకుండా ఇప్పటికే చిత్తూరు కార్పొరేషన్‌, పలమనేరు, పుంగనూరు మున్సిపాలిటీలు అధికార వైకాపా ఖాతాలో పడ్డాయి. చిత్తూరులో 50 డివిజన్లకు 37, పలమనేరులో 26 వార్డులకు 18, పుంగనూరులో 31 స్థానాలనూ కైవసం చేసుకుంది. మరోవైపు చిత్తూరు, పలమనేరులో విపక్ష పార్టీల అభ్యర్థులు తాము అధికార పార్టీ ఒత్తిళ్లను ధైర్యంగా ఎదుర్కొని.. బరిలో నిలిచామని చెబుతున్నారు. గట్టి పోటీ కూడా ఇచ్చామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరపాలక సంస్థలో 50 డివిజన్లు ఉండగా 22, మదనపల్లెలో 35 వార్డులకు 15 వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. తిరుపతిలో నాలుగు డివిజన్లు, మదనపల్లెలో మూడు వార్డులు అధికార పార్టీ గెలుచుకుంటే పుర పీఠాలు వైకాపా పరం కానున్నాయి. అయితే ఇక్కడ గట్టి పోటీని ఇచ్చామని, వైకాపాకు అంత తేలికగా అధికారం దక్కదని విపక్ష పార్టీలు అంటున్నాయి.

నగరి, పుత్తూరుపై సర్వత్రా ఆసక్తి

నగరిలోని 29 వార్డుల్లో ఎన్నికలకు ముందే ఆరింటిని వైకాపా, ఒక స్థానాన్ని తెదేపా కైవసం చేసుకుంది. ఇక్కడ అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్ష తెదేపా అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. దీనికితోడు వైకాపాను రెబల్స్‌ బెడద వెంటాడింది. ఈ మున్సిపాలిటీలో ఛైర్మన్‌ పదవి దక్కాలంటే వైకాపాకు తొమ్మిది, తెదేపాకు 14 స్థానాలు కావాల్సి ఉంది. పుత్తూరులో 27 వార్డులకుగాను ఒకటి మాత్రమే ఏకగ్రీవమైంది. దీన్ని అధికార పార్టీ దక్కించుకుంది. గెలుపు కోసం వైకాపాకు 13, తెదేపాకు 14 స్థానాలు రావాల్సి ఉంది. ఇక్కడ కూడా వైకాపాకు ఇంటి పోరు ఉంది. ఇంటి పట్టాల పంపిణీ, సంక్షేమ పథకాల అమలు.. అధికారంలో ఉన్నందున విజయం తమ పార్టీదేనని వైకాపా నాయకులు అంచనా వేసుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీల్లోనూ తమకే మెజారిటీ వచ్చిందని..ఇప్పుడు కూడా ఓటర్లు అదే తీర్పు ఇవ్వనున్నారని తెదేపా నేతలు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా నగరి, పుత్తూరు మున్సిపాలిటీల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపుతో పుర పీఠాలను అధిష్ఠించే పార్టీ ఏదో తేలనుంది.

ఇదీ చదవండి...

విజయవాడలో ఎన్నికల నిర్వహణలో .. తొలి నుంచి తడబాటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.