చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపల్ చైర్మన్‌గా నంగి హరి ప్రమాణ స్వీకారం చేశారు. పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా చిత్తూరు ఆర్డీవో రేణుక వ్యవహరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వైకాపా కౌన్సిలర్లు 22 మంది సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఛైర్మన్ ఎన్నిక లాంఛనంగా ప్రారంభించారు.
మున్సిపల్ ఛైర్మన్ గా హరి , వైస్ ఛైర్మన్‌గా శంకర్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ గెలిచిన కౌన్సిలర్లు అందరూ తమ తమ వార్డుల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. గత పాలకవర్గం సక్రమంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టక పోవడం వల్లే వైకాపాకు ఓటు వేసి గెలిపించారని.. అలాంటి పొరపాట్లు ఎవరో చేయవద్దని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట రామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం: నేడు సీఐడీ ఎదుట ఎమ్మెల్యే ఆర్కే హాజరు