అధికారుల నిర్లక్ష్యానికి అమాయకులు బలవుతున్నారని రైల్వే, కార్పొరేషన్ అధికారులపై.. తిరుపతి ఎంపీ గురుమూర్తి(tirupathi mp gurumurthy) ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని అండర్ బ్రిడ్జ్ వద్ద శుక్రవారం రాత్రి వరదనీటిలో మునిగి.. కర్ణాటకకు చెందిన భక్తురాలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. నగరంలోని వెస్ట్ చర్చి(west church) సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జిని శనివారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా.. మున్సిపల్, రైల్వే అధికారుల తీరును ఎంపీ ప్రశ్నించారు. వరదనీటిలో మునిగి యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అంతా తల దించుకోవాలని అన్నారు. 40ఏళ్ల క్రితం నిర్మించిన అండర్ బ్రిడ్జి ప్రస్తుత అవసరాలకు సరిపోయేలా ఉందా? అని ప్రశ్నించారు. వరదనీరు ప్రవహించే వ్యవస్థ ఉందా అన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రెండు శాఖల అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఎంపీ అన్నారు.
ఇదీ చదవండి:
Demolish Of Market : ధర్మవరంలో కూరగాయల మార్కెట్ తొలగింపు.. అడ్డుకున్న వ్యాపారులు