ETV Bharat / state

వసతి గృహాల నిర్మాణంపై కర్ణాటక, తితిదే మధ్య ఒప్పందం

తిరుమలలో కర్ణాటక లీజుకు తీసుకున్న స్థలంలో వసతి సముదాయాలు నిర్మించడానికి కర్ణాటక ప్రభుత్వం, తితిదే మధ్య ఒప్పందం జరిగింది. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప‌తో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సమావేశమై ఈ అంశంపై చర్చించారు. తితిదే నిబంధనల మేరకు వసతి సముదాయాల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.

author img

By

Published : Jul 4, 2020, 1:08 PM IST

Updated : Jul 4, 2020, 3:11 PM IST

mou-between-ttd-and-karnataka-government
వసతి గృహాల నిర్మాణంపై కర్ణాటక, తితిదే మధ్య ఒప్పందం

తిరుమలలోని కర్ణాటక చారిటీస్​కు తితిదే లీజుకు ఇచ్చిన స్థలంలో నూతన వసతి సముదాయాల నిర్మించడానికి కర్ణాటక ప్రభుత్వం, తితిదే నిర్ణయం తీసుకుంది. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప‌తో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ శ్రీ ఏవీ ధర్మారెడ్డి బెంగళూరులో సమావేశమయ్యారు.

తిరుమ‌ల‌లోని 7.05 ఎకరాల భూమిని 50 సంవత్సరాల కాల పరిమితికి 2008 సంవత్సరంలో తితిదే కర్ణాటక ప్రభుత్వానికి లీజుకు ఇచ్చింది. ఈ ప్రాంతంలో నూతన వసతి సముదాయాల నిర్మాణం ప‌నులు చేప‌ట్టేందుకు తితిదే అనుమ‌తి కోరుతూ కర్ణాటక రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ఒక ప్లాన్‌ను దేవస్థానానికి స‌మ‌ర్పించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి య‌డ్యూర‌ప్పతో తితిదే ఛైర్మన్ చర్చించారు. క‌ర్ణాట‌క స‌త్రాల ప్రాంతంలో కొత్త‌గా నిర్మించాలనుకుంటున్న నూతన వసతి సముదాయం తితిదే నిబంధనల మేరకు నిర్మించడానికి కర్ణాటక ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.

పడమర మాఢ వీధి వైపు 1.94 ఎకరాల భూమిని బ్రహ్మోత్సవాలు, ఇతర సమయాల్లో భక్తుల అవసరాల కోసం ఖాళీగా ఉంచి మిగిలిన భూమిలో నిర్మాణాలు చేసుకోవడానికి అంగీకారం కుదిరింది. ఈ ప్రతిపాదనలు తితిదే పాలకమండలి సమావేశంలో ఆమోదించాక కర్ణాటక ప్రభుత్వం రూ.200 కోట్లు తితిదే ఖాతాలో జమ చేస్తుంది. అనంతరం కర్ణాటక సీఎం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. తితిదే భవనాలు నిర్మించి కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించేలా అవగాహన కుదుర్చుకొన్నారు.

ఇదీ చదవండి..

తితిదే ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం

Last Updated : Jul 4, 2020, 3:11 PM IST

For All Latest Updates

TAGGED:

news on ttd
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.