తమ కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ.. ఓ తల్లి మరో కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలంలో వారిరువురూ విషం తాగారు. బాధితులను స్థానికులు కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు నిరసన చేపట్టాయి.
కుప్పంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్న 16 ఏళ్ల బాలిక నాలుగు రోజుల కిందట అదృశ్యమైంది. ఈ విషయంపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాలిక తల్లి ఆరోపించింది. మరో కుమార్తెతో పాటు ఆమె విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
ఇదీ చదవండి: కూతురికి ఓటేసి.. కన్నుమూసిన తండ్రి