చిత్తూరు జిల్లా పుత్తూరులో నిరుపేదలకు ఎమ్మెల్యే రోజా అల్పాహారం అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా వైరస్ నియంత్రణ కోసం శ్రమిస్తున్నారన్నారు. అలాగే తాము... వైద్య, ఆరోగ్య శాఖల సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ శాఖ చిత్తశుద్ధితో పని చేస్తున్నట్టు చెప్పారు. జర్నలిస్టులు కూడా కుటుంబాలను వదిలి కరోనా వైరస్ నియంత్రణకు కృషి చేస్తున్నారని వారి సేవలు కూడా ప్రశంసనీయమని తెలియజేశారు. కనిపించే మూడు సింహాలు పోలీసులు, డాక్టర్లు,మున్సిపల్ అధికారులయితే కనిపించని నాలుగో సింహమే...జర్నలిస్టులని ఆమె పేర్కొన్నారు.
ఇదీ చూడండి: