చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన వైకాపా నాయకులు, అభ్యర్థుల సమావేశంలో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు.. ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. పుత్తూరు మున్సిపాలిటీలో 27 వార్డులను గెలిపించుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని... ఎమ్మెల్యే రోజా సోదరుడు రామ్‌ప్రసాద్ రెడ్డి సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను అధిగమించి.. విజయం సాధించాలని కోరారు.
ఇదీ చదవండీ.. వందశాతం ఆన్లైన్ క్లాసులకు వీలుగా సాంకేతికత అభివృద్ధి: మంత్రి సురేశ్