చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఎమ్మెల్యే తమ్ముడు హనుమంతు రెడ్డి(45) అనారోగ్యంతో మృతి చెందారు. గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో హనుమంత రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి