చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం వేకువజామున 5 గంటలకు సత్యవేడు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపు... సర్వేల పేరుతో తమ పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తున్నారని చెవిరెడ్డి ఆరోపించారు. వివాదంపై ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు చేసేందుకు ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా... చెవిరెడ్డి ఠాణాలోనే నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఎమ్మెల్యే చెవిరెడ్డిని అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ... వైకాపా కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి సత్యవేడు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న పార్టీ శ్రేణులను పోలీసులు కట్టడి చేస్తున్నారు. సత్యవేడుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే నిరాహార దీక్ష... కార్యకర్తల ఆందోళనతో సత్యవేడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.