విజయనగరం జిల్లా కురుపాం మండలం నీలకంఠాపురం, సీరికొండ, కొత్తపేట, సాలడంగుడా, దిగువ సాలడంగుడా, కంబమనుగడ గ్రామాలలో పోలీసు అధికారులు 250 మంది నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని విశ్వం కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో బాధ్యతలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి, ప్రభుత్వ ఉద్యోగులకు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పీపీఈ కిట్స్‌ను ఉచితంగా అందజేశారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని నాయీబ్రాహ్మణలకు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి... 400 కుటుంబాలకు నిత్యావసర సరకులను అందచేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో పనిచేసే సచివాలయ ఉద్యోగులు, వాటర్ వర్క్స్, విద్యుత్తు కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
రాష్ట్రంలో 70 వేలమంది వలస కార్మికులు ఉన్నారని ప్రభుత్వం చెబుతోందని.. .ప్రస్తుతం అందుబాటులో కేవలం 49 క్యారయింటైన్ సెంటర్లు మాత్రమే ఉన్నాయని.... క్యారయింటైన్ సెంటర్లను పెంచితే సమస్యను చాలా వరకు తగ్గించవచ్చని కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహారావు అన్నారు. వలస కార్మికుల సమస్యలను అయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఇదీ చూడండి కరోనాను ఎదుర్కోవడానికి రాష్ట్రం అన్ని విధాలా సిద్ధం'