చిత్తూరు జిల్లా తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు మృతదేహాలను ఖననం చేయడాన్ని వ్యతిరేకించడంతో... మృతదేహాలు నిల్వ ఉండిపోతున్నాయి. కరోనాతో మరణించిన వారిని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు నిరాకరించడంతో వారికి అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ నిర్ణయించుకుని గోవిందధామంలో స్వతహాగా వారే శవాలకు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
కరోనా వైరస్‌తో చనిపోయిన వారి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు రాకపోవడం చాలా బాధించిందని ఎమ్మెల్యే తెలిపారు. తిరుపతిలో కొవిడ్ వల్ల చనిపోతున్న వారికి కరకంబాడి రోడ్డు వద్ద ఉన్న గోవింద ధామం వద్ద దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కొవిడ్ ద్వారా మరణిస్తే వైరస్ సోకదని వారు, వైద్యులు, అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: