ETV Bharat / state

పుత్తూరులోని కొవిడ్ సెంటర్​కు మిత్ర కార్పొరేట్ సంస్థ విరాళం - పుత్తూరులో రోజా ఛారిటబుల్ ట్రస్టు

కొవిడ్ వేళ ప్రతి ఒక్కరూ తమకు చేతనైన సాయం చేస్తున్నారు. పలువురు దాతలు నగదు, మెడికల్​కు సంబంధించిన సామగ్రి అందించి తమ ఉదారతను చాటుకుంటున్నారు. పుత్తూరులోని కేకేసీ కొవిడ్ సెంటర్​కు రూ.25 లక్షల విలువ చేసే మందులు, పదిహేను ఆక్సీ కాన్సంట్రేటర్లను బెంగుళూరుకు చెందిన ఓ దాత అందజేశారు.

covid
పుత్తూరులోని కోవిడ్ సెంటర్​కు మిత్ర కార్పొరేట్ సంస్థ విరాళం
author img

By

Published : May 23, 2021, 7:30 PM IST

చిత్తూరు జిల్లా పుత్తూరులోని కేకేసీ కోవిడ్ సెంటర్​కు రూ.25 లక్షల విలువ చేసే మందులు, పదిహేను ఆక్సీ కాన్సంట్రేటర్ల​ను ఓ దాత అందజేశాడు. రోజా ఛారిటబుల్ ట్రస్టుకు బెంగళూరుకు చెందిన మిత్ర కార్పొరేట్ సంస్థ సీఈవో అమర్ వాటిని డొనేట్ చేశారు. నగరి ఎమ్మెల్యే రోజా.. వైద్యశాలలో కావాల్సిన అన్నిరకాల మందులు, భోజన సదుపాయాలు, ఇతరత్రా సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.

ఎమ్మెల్యే చేస్తున్న సర్వీసుకు స్పందించి బెంగళూరుకు చెందిన మిత్ర కార్పొరేట్ సంస్థ సీఈవో అమర్ ట్రస్టుకు తన వంతు సాయం చేశారు. అలాగే రోజా ఛారిటీ ద్వారా పుత్తూరు మున్సిపాలిటీలోని ప్రైమరీ హెల్త్ సెంటర్​కు కావలసిన అని పరికరాలు, మందులను రోజా సోదరుడు రాంప్రసాద్ రెడ్డి, ప్రత్యేక అధికారిణి, డీఆర్​డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ తులసికి అందజేశారు.

ఇదీ చూడండి.

'ఆనందయ్య మందుకు అనుమతి వస్తే.. ఔషధం తయారీకి తితిదే సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.