కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే లక్ష్యంతో విద్యాశాఖలో నాడు - నేడు కార్యక్రమం అమలు చేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకపరిధిలోని మండల కేంద్రం సదుంలో 58 లక్షల రూపాయలతో ఆధునికీకరిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి పరిశీలించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నట్లు మంత్రి తెలిపారు.
నాడు - నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు మంత్రికి వివరించారు. క్రీడామైదానం.. పాఠశాల ప్రహారీ నిర్మాణాలను మంత్రి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: