ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పిఎల్ఆర్ జాబ్ సెంటర్ ఆధ్వర్యంలో పుంగనూరులో జరిగిన జాబ్ మేళాలో ఎంపికైన యువతకు తిరుపతిలోని తన నివాసంలో నియామక పత్రాలను అందజేశారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి ప్రారంభించారని మంత్రి తెలిపారు. గతంలో యువకులను ఉద్యోగాల నుంచి తొలగించారని.. తాము అధికారంలోకి వచ్చాక యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు.
ఇదీ చదవండి
SAI DHARAM TEJ: సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్