చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరు సమీపంలో పేదలకు పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాలను.. కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాతో కలిసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. హెలిప్యాడ్, బహిరంగ సభ ఏర్పాట్ల గురించి అధికారులకు సూచనలు ఇచ్చారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
సీఎం జగన్ చేతుల మీదుగా.. ఈనెల 28న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. అందుకు ఏర్పాట్లను పరిశీలించడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఊరందూరులో పర్యటించారు.
ఇదీ చదవండి: