నీరు చెట్టు పేరుతో ఉపాధి హామీ నిధులను దుర్వినియోగం చేసిన తెదేపా నేతలే... రాష్ట్రపతిని కలవటం కుట్రపూరితమంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విమర్శించారు. ఉపాధి హామీ పనులకు.. నీరు చెట్టు కింద బిల్లులు పెట్టుకున్న ఘనత తెదేపాకు ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ పనుల్లో అవకతవకలపై.. విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని చెప్పారు. త్వరలోనే దీనిపై సమగ్ర నివేదిక హైకోర్టుకు సమర్పించనున్నామన్నామని వెల్లడించారు.
ఇళ్ల స్థలాల విషయంలోనూ పేదలకు న్యాయం జరగకుండా.. తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతోందంటూ పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. జస్టిస్ రామకృష్ణపై వైకాపా నాయకుల దాడి అంటూ చేస్తున్న ప్రచారం అసత్యమన్న మంత్రి.. అసలు ఆయన సస్పెండ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిందని చెప్పారు. న్యాయమూర్తి నుంచి కేసు తీసుకోవద్దని తాను పోలీసులకు ఫోన్ చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. పెద్దిరెడ్డి సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: