తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సమీపంలో... శనివారం రాత్రి నాటుబాంబు పేలింది. ఈ ప్రాంతాన్ని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పరిశీలించారు. అడవి పందులు రాకుండా ఏర్పాటు చేసుకునేందుకు వేరేవాళ్లు ఆటోలో తీసుకొచ్చారని... ఆ బాంబును కుక్క లాక్కెళ్లటంతోనే ఈ ఘటన జరిగిందని ఎస్పీ మంత్రికి వివరించారు. భద్రతా పర్యవేక్షణను ఆసుపత్రుల వద్ద పటిష్ఠం చేయాలని ఎస్పీకి సూచించిన మంత్రి... అనంతరం ఆసుపత్రిని పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైఎస్ఆర్ కిట్లను వారికి అందించి... వైద్యసేవలపై ఆరా తీశారు. మంత్రికి నగర శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావు భూపాల్ స్వాగతం పలికారు.
ఇవీ చదవండి....'ఈటీవీ భారత్ రుణం ఇలా తీర్చుకున్నారు..!'