తిరుపతి పద్మావతి ఆసుపత్రిలో సరైన వైద్యం అందించకపోవడం వల్లే తమ కుమారుడు చనిపోయాడంటూ తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళనపై వైద్యారోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని స్పందించారు. జరిగిన ఘటనపై డీఎంహెచ్‌వో, ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్లో మాట్లాడారు. కరోనా, బ్లాక్ ఫంగస్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. రోగుల బంధువులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని తిరుపతి ఆర్డీవోకు మంత్రి ఆదేశించారు. రోగులకు ఆహారం, శానిటేషన్ విషయంలో ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు.
చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన 28 ఏళ్ల ఓ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం చనిపోయారు. ఆక్సిజన్ సరఫరా లేక ఇబ్బందిపడుతున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదని మృతుడి తల్లిదండ్రులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. మరో ఘటనలో ఓ బ్లాక్ ఫంగస్ బాధితురాలు ఆసుపత్రిలోనే ఉరేసుకుని ఈ ఉదయం చనిపోయారు. ఈ రెండు ఘటనలతో కలకలం రేగింది. వీటిపై స్పందించిన మంత్రి ఆళ్ల నాని.. మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఇదీచదవండి.