చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో తహసీల్దారు రవీంద్రా రెడ్డిని మండలంలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వలస కూలీలు కలిశారు. తమను స్వరాష్ట్రాలకు పంపాలని కోరారు. పనులు లేక అవస్థలు పడుతున్నామని.. ఉండడానికి నివాసం, తినడానికి తిండి ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అడవుల్లోని గ్రానైట్ క్వారీల వద్ద విష పురుగుల బెడద ఎక్కువగా ఉందని చెప్పారు.
తొందరగా తమను స్వరాష్ట్రాలకు పంపించాలని విన్నవించారు. తంబళ్లపల్లి మండలంలో 60, పెద్ద మండలంలో 20, పెద్దతిప్ప సముద్రం లో 25, బి.కొత్తకోటలో 31, ములకలచెరువు, కురబలకోట మండలాల్లో 30కి పైగా కూలీలు.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే పంపిస్తామని తంబళ్లపల్లి తహశీల్దారు రవీందర్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: