ETV Bharat / state

కొవిడ్​తో మతిస్థిమితం లేని వ్యక్తి మృతి - కోళ్లపల్లి వద్ద మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

కరోనా సంక్షోభం వేళ హృదయవిదారక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సాధారణ మనుషులు వెళితేనే పడకలు లేవు పోమ్మంటున్నారు కొవిడ్ ఆసుపత్రి సిబ్బంది. ఇక మతిస్థిమితం లేని వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కరోనా​ సోకిన ఓ మతిస్థిమితం లేని మృతి చెందాడు.

mentally challenged person
మతిస్థిమితం లేని వ్యక్తి
author img

By

Published : Apr 29, 2021, 2:50 PM IST

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి చెందిన నల్లప రెడ్డి అనే వ్యక్తికి మతిస్థిమితం లేదు. కొద్ది రోజుల క్రితం అతనితో పాటు కుటుంబంలోని వారందరికి కరోనా సోకింది. మతిస్థిమితం లేని కారణంగా మిగిలిన వారికి ఇబ్బంది కలిగిస్తాడని నల్లప రెడ్డిని ఇంటి వద్దనే ఉంచారు. మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ వైపు ఆదరించే కుటుంబసభ్యులు లేక.. మరో వైపు కొవిడ్​కు వైద్యం అందక కర్ణాటక సరిహద్దు ప్రాంతం కోళ్లపల్లి వద్ద మృతి చెందాడు. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఇదీ చదవండీ.. కిరాతకం: కట్టుకున్నదాన్ని.. కడుపున పుట్టిన వాళ్లని వదల్లేదు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.