చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపల్ సంఘం సభ్యుల సమావేశం చైర్మన్ హరి అధ్యక్షతన నిర్వహించారు. కార్వేటి నగరం కోటలోని అంబేద్కర్ విగ్రహానికి తేదేపా కౌన్సిలర్లు పూలమాలవేసి ర్యాలీగా తరలివెళ్లారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు.. కౌన్సిలర్లు, నాయకులతో వాగ్వాదానికి దిగారు. కొవిడ్ నిబంధనలు మేరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు.. పోలీసులకు సర్దిచెప్పారు.
అనంతరం.. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్.. కౌన్సిలర్లు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పుత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధికి నగిరి ఎమ్మెల్యే రోజా.. పది కోట్లు మంజూరు చేశారని చైర్మన్ తెలిపారు. ఆ నిధులతో అవసరమైన వార్డుల్లో మౌలిక సదుపాయాలు చేపట్టినట్లు తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకట్రాంరెడ్డి అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: