తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఉడిపి పెజావర్ పీఠాధిపతి విశ్వప్రసన్నతీర్థ స్వామిజీ, భాజాపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్, విశాఖ ఎంపీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు బిజేంద్రనాథ్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, చిత్తూరు జిల్లా న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర బాబు దర్శించుకున్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.
వీరితోపాటుగా... మధ్యప్రదేశ్ మంత్రి అరవింద్ బహుదూరియా, గుజరాత్ రాష్ట్ర పోరుబందర్ ఎంపీ రమేష్ బాయ్ దుడుకు కూడా స్వామివారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వదించారు.
ఇవీ చూడండి: