జ్ఞానమే ధనం.. .సంస్కారమే బలమన్న నినాదంతో తిరుపతిలో మానవ వికాస వేదిక భారీ ర్యాలీ నిర్వహించింది. నగరంలోని బాలాజీ కాలనీ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ సాగింది. తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి ర్యాలీలో పాల్గొని సంస్థ ప్రతినిధులను అభినందించారు. రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ ర్యాలీలో పలు పార్టీలు, యూనియన్ల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇదీచదవండి