ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఏనుగు మృతి.. ఎక్కడంటే..? - Elephant died news

Elephant died due to electrocution: చిత్తూరు జిల్లా మొగలివారిపల్లి కౌండిన్య అభయారణ్యం లో.... విద్యుదాఘాతంతో మగ ఏనుగు మృతి చెందింది. కుంటబెల్ల అటవీ ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్​ను ఆనుకోవడంతో షాక్​కు గురైనట్లు స్థానికులు గుర్తించారు. గత 6 నెలల్లో 4 ఏనుగులు విద్యుత్ ప్రమాదాలతో మృత్యువాత పడ్డాయి.

Elephant died due to electrocution
Elephant died
author img

By

Published : Dec 2, 2022, 5:37 PM IST

Updated : Dec 2, 2022, 8:09 PM IST

Male elephant died due to electrocution: చిత్తూరు జిల్లాలో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. మొగలివారిపల్లిలోని కుంటబెల్ల అటవీ ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌ను ఏనుగు తాకింది. ఈ క్రమంలో.. షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయింది. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అభయారణ్యంలో ఆరు నెలల వ్యవధిలో 4 ఏనుగులు విద్యుదాఘాతంతో చనిపోయాయని స్థానికులు విచారం వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలు జరుగుతునప్పటికి అధికారుల్లో ఎలాంటి చలనం కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులతో పాటుగా.. అటవీ అధికారుల సమన్వయంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 2, 2022, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.