ETV Bharat / state

సాఫ్ట్​వేర్​ కుర్రోళ్లు... పేమెంట్ యాప్​లతో మోసాలు - చిత్తూరు జిల్లా వార్తలు

సాఫ్ట్​వేర్ పరిజ్ఞానం ఉన్న తొమ్మిది మంది ... ఉద్యోగాల వేటలో పడాల్సింది పోయి.. పక్కదారి పట్టారు. తెలిసిన పరిజ్ఞానంతో ఓ యాప్ రూపొందించారు. యాప్​తో సైబర్ నేరాలకు తెరతీశారు. దుకాణాల్లో కొనుగోలు చేయడం... మా స్నేహితుడు గూగుల్ పే చేస్తాడని చెప్పి, వేరే చోట ఉన్న మిత్రుడికి ఫోన్​ చేస్తారు. అతడు దుకాణదారుడి ఫోనుకు నగదు జమ అయినట్లు ఓ మేసేజ్​ పంపిస్తాడు. నగదు వచ్చిందని భావిస్తున్న దుకాణదారులు వస్తువులు ఇస్తారు. తర్వాత బ్యాంకు ఖాతా పరిశీలిస్తే.. నగదు జమకావట్లేదని గుర్తిస్తున్నారు. ఈ మోసాన్ని పసిగట్టిన దుకాణదారులు మదనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సాఫ్ట్​వేర్​ కుర్రోళ్లు... పేమెంట్ యాప్​లతో మోసాలు

author img

By

Published : Jun 30, 2020, 6:35 PM IST

Updated : Jun 30, 2020, 7:09 PM IST

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న తొమ్మిది మందిని చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది యువకులు ముఠాగా ఏర్పడి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాణిజ్య దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసి.. చెల్లించాల్సిన నగదును గూగుల్​ పే, ఫోన్ పే ద్వారా చెల్లిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. నగదు చెల్లించినట్లు ఇంటర్నెట్ ద్వారా దుకాణం యజమాని ఖాతాలో నగదు జమ అయినట్లు మెసేజ్ పంపిస్తున్నారని మదనపల్లి డీఎస్పీ రవి మనోహర్ ఆచారి తెలిపారు.

సైబర్ నేరాలకు పాల్పడుతున్న యువకులు
సైబర్ నేరాలకు పాల్పడుతున్న యువకులు

దుకాణదారులు ఖాతా తనిఖీ చేయగా... నగదు రాలేదని గుర్తించారు. తొమ్మిది మంది సాఫ్ట్​వేర్​ పరిజ్ఞానంతో.. సొంతంగా ఓ యాప్​ను రూపొందించారని డీఎస్పీ తెలిపారు. దుకాణదారుల ఫిర్యాదుతో నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒక యువతి ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు.

ఇదీ చదవండి : అధికార పార్టీ అండదండ ఉంటే...కొండైనా నీదే!

Last Updated : Jun 30, 2020, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.