ETV Bharat / state

బడ్జెట్‌లో చిత్తూరు జిల్లాకు తగ్గిన ప్రాధాన్యం..!? - చిత్తూరు జిల్లా

రాష్ట్ర బడ్జెట్‌లో చిత్తూరు జిల్లాకు తగినంత కేటాయింపులు లేకపోవడంపై... జిల్లావాసులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌లు, విద్యారంగ అభివృద్ధికి నిధులు ఆశించిన మేర కేటాయించలేదు. తిరుపతి నగర అభివృద్ధికి కేంద్ర నిధులు కేటాయిస్తున్నా... రాష్ట్ర ప్రభుత్వ వాటా లేకపోవడంపై నగర వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బడ్జెట్‌
author img

By

Published : Jul 13, 2019, 6:03 AM IST

బడ్జెట్‌

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వైకాపా ప్రభుత్వం అమ్మఒడి, వైఎస్సార్‌ చేయూత, రైతుభరోసా వంటి సంక్షేమ పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించడం... ప్రాథమిక విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించిన ప్రభుత్వం... సాగునీటి రంగానికి తెదేపా సర్కారుతో పోలిస్తే నిధులు తగ్గించడంపై రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

చిత్తూరు జిల్లాను సస్యశ్యామలం చేసే గాలేరు-నగరి, హంద్రీనీవా ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయడానికి నిధులు కేటాయించకపోవడంపై జిల్లా ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. బాలాజీ, మల్లెమడుగు, వేణుగోపాల్‌సాగర్‌ జలాశయాల నిర్మాణాలకు నిధులు కేటాయించకపోవడంతో వాటి నిర్మాణాలు ప్రశ్నార్థకమవుతున్నాయి. చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంత భూములను సస్యశ్యామలం చేసే హంద్రీనీవా ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి అవసరమైన నిధులు బడ్జెట్‌లో ప్రతిపాదించలేదు.

సంక్షేమ పథకాలకు నిధులు అధికమొత్తంలో కేటాయించిన ప్రభుత్వం...అంతే స్థాయిలో ఉన్నత విద్యావిభాగాలకు నిధులు కేటాయించకపోవడంపై విద్యారంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని 7వర్సిటీల్లో పరిశోధనల కోసం నిధులు కేటాయించకపోవడంపై విద్యారంగ నిపుణులు తప్పుపడుతున్నారు. గతంలో పశువైద్య విశ్వవిద్యాలయంలో పరిశోధనల కోసం రూ.150 కోట్లు కేటాయించగా... ఈ ఏడాది ఆ ఊసే లేకపోవడం పరిశోధన చేస్తున్న విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండీ...

శ్వేతపత్రంలో ఒకటి.. బడ్జెట్​లో మరొకటి: చంద్రబాబు

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

sluge : Ap_Atp_02c_12_No_Rains_No_Cultivation_pkg_AP10097_AP10004_3053763

వర్షాభావంతో రైతులు పడుతున్న ఇబ్బందులు, వారు ఎదుర్కొంటున్నా సమస్యలపై కథనం చేయడం జరిగింది.

Body:బైట్ 1 : లక్ష్మీపతి, రైతు.
బైట్ 2 : వెంకటేసులు, రైతు.
బైట్ 3 : శ్రీనివాసులు, రైతు.
బైట్ 4 : ఓబయ్య, రైతు.

Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 12-07-2019
sluge : Ap_Atp_02c_12_No_Rains_No_Cultivation_pkg_AP10097_AP10004_3053763
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.