చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమాదారిలో రహదారి ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి మదనపల్లికి రాగులతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ఘటనలో క్లీనర్ మృతి చెందాడు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా వారిని చిన్నగొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: విశాఖ దుర్ఘటన: బాధితులకు నేడు పరిహారం