ETV Bharat / state

నేడు రాష్ట్రానికి లోక్‌సభ స్పీకర్‌ ఓంప్రకాశ్‌ బిర్లా

రేపు చిత్తూరు జిల్లా పర్యటనకు లోక్‌సభ స్పీకర్‌ ఓంప్రకాశ్‌ బిర్లా

author img

By

Published : Aug 15, 2021, 7:56 PM IST

Updated : Aug 16, 2021, 12:13 AM IST

19:55 August 15

తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న లోక్‌సభ స్పీకర్‌ ఓంప్రకాశ్‌ బిర్లా

రెండు రోజుల పర్యటన నిమిత్తం లోక్​సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా నేడు చిత్తూరు జిల్లా రానున్నారు. మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న ఆయన.. 1.30 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరుమలకు చేరుకుని.. 5.30 గంటలకు వైకుంఠం ద్వార దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తిరుమల శ్రీకృష్ణ వసతిగృహంలో స్పీకర్ ఓం బిర్లా బస చేస్తారు.

మంగళవారం ఉదయం విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శానానంతరం పద్మావతి వసతి గృహంలో తితిదే అధికారులతో సమీక్షించనున్నారు. తిరుమల ధర్మగిరి వేదపాఠశాలను సందర్శించిన తర్వాత.. తిరుపతి కపిలేశ్వర స్వామిని, శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని ఓం బిర్లా దర్శించుకుంటారు. ఈ మేరకు.. అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి:

'నాడు- నేడు' స్కూళ్లను.. ప్రజలకు అంకితం చేయనున్న సీఎం జగన్​

Last Updated : Aug 16, 2021, 12:13 AM IST

For All Latest Updates

TAGGED:

om birla
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.