ETV Bharat / state

తిరుమల దారిలో గజరాజులు.. జాగ్రత్త చర్యల్లో అధికారులు - తిరుమలలో ఏనుగులు గుంపు

తిరుమల మొదటి కనుమ దారిలో పెద్ద సంఖ్యలో ఏనుగులు సంచరిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కనుమ దారిలో ఏనుగుల సంచరించడంపై అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు.. సోమవారం నుంచి భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. మళ్లీ గజరాజులు కనుమ మార్గంలో తిరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు.

తిరుమల దారిలో గజరాజులు.. గమనంపై అధికారుల ఆరా

author img

By

Published : Jun 6, 2020, 6:43 PM IST

Updated : Jun 6, 2020, 7:43 PM IST

తిరుమల మొదటి కనుమ దారిలో ఏనుగులు సంచరించిన ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏనుగులు రహదారిపైకి రావడంపై.. అక్కడున్న పరిస్థితిపై ఆరా తీశారు.

ఏనుగులు సంచరించిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అటవీ అధికారులు

సోమవారం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్న కారణంగా.. ఏనుగులు మళ్లీ రహదారిపైకి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గజరాజుల గుంపు ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉందనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి:

సర్వేయర్​పై సభాపతి ఆగ్రహం.. కారణం ఇదీ..?

Last Updated : Jun 6, 2020, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.