విశాఖ మన్యం అరకులోయను స్పీకర్ కోడెల కుటుంబ సమేతంగా సందర్శించారు. గిరిజన మ్యూజియం, కాఫీ తోటలు, మ్యూజియం, పద్మాపురం వంటి ప్రదేశాలను సందర్శించారు. అరకులోయ అందాలను చూసి ముగ్ధులయ్యారు. అక్కడ ఉండే గిరిజనులను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పర్యాటకంగా, కాఫీ పరంగా మరింతగా అభివృద్ధి చేస్తే గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. గిరిజనులకు ఆర్థిక పరిపుష్టి కలిగించాలన్నారు. ప్రకృతి సోయగాల మధ్య అరకులోయ మరింత అందంగా ఉందన్నారు.
ఇది కూడా చదవండి..ప్రధాని యాత్రలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్