తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తితిదే తిరుపతి జేఈవో పి.బసంత్‌కుమార్ తెలిపారు. అమ్మవారి ఆలయంలో ఇవాళ ఉదయం జరిగిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
తిరుమంజనంలో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. కొవిడ్-19 నేపథ్యంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని జేఈవో తెలిపారు. పరిమిత సంఖ్యలో సిబ్బందితో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(ఆలయశుద్ధి) నిర్వహించామన్నారు.
ఇదీ చదవండి