తిరుపతి కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఆరో రోజు స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన హనుంతుడి వాహనంపై విహరించే శ్రీరామచంద్రుడిని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయన్నది భక్తుల విశ్వాసం. వైష్ణవ సాంప్రదాయంలో తిరువడిగా కీర్తించే హనుమద్వాహన సేవను దర్శించి భక్తులు తిలకించి తరించారు. వాహనసేవ అనంతరం స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
ఇవీ చూడండి...