కార్తీకమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. స్వర్ణముఖి నదిలో పుణ్య స్నానాలు అచరించి... ప్రత్యేక పూజలు చేశారు. స్వామి సర్వ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి:
శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాస ఉత్సవాలకు ఏర్పాట్లు