తిరుమలలో ఐదురోజులుగా నిర్వహిస్తున్న వరుణయాగం... పూర్ణాహుతి కార్యక్రమంతో వైభవంగా ముగిసింది. దేశం నలుమూలలా వర్షాలు సమృద్ధిగా కురిసి... పాడి, పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ కారీరిష్టి పేరుతో తితిదే ఈ యాగం నిర్వహించింది. ఐదు రోజులుగా పార్వేట మండపం వద్ద వరుణయాగం, వరాహపుష్కరిణి చెంత వరుణజపం, ఆస్థాన మండపంలో విరాటపర్వం పారాయణం, నాదనీరాజనం వేదికపై అమృతవర్షిణి రాగాలాపన... కపిలతీర్థంలో పర్జ్యన్య శాంతియాగాలను రుత్వికులు నిర్వహించారు. చివరగా మహాపూర్ణాహుతితో క్రతువును ముగించారు.
ఇవీ చూడండి-అంతరిక్షరంగంలో యువత నైపుణ్యం సాధించాలి: ఇస్రో ఛైర్మన్