చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని కళ్యాణి డ్యామ్ జలాశయానికి పూర్తిస్థాయిలో నీరు చేరింది. డ్యామ్ సామర్థ్యానికి సరిపడా నీరు చేరటంతో మూడు గేట్లలో ఒక గేటును మూడు ఇంచులు మేర తెరిచి అధికారులు నీటిని కిందికి విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల వారు, స్వర్ణముఖి వాగు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. డ్యాం చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి రావటంతో తిరుపతి - అనంతపురం రోడ్డు వాహనాలతో నిండింది. అధికారులు జలాశయం చూసేందుకు అనుమతించకపోవటంతో సందర్శకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
ఇవీ చూడండి...