తిరుపతిలోని ఎమ్మార్‌పల్లి కూడలి నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు జూనియర్ డాక్టర్లు, మానవహారం నిర్వహించారు. ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్రం తీరును తప్పుపట్టారు. వైద్యవ్యవస్థను పాడుచేసేలా బిల్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం దిగిరాని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన మరింద ఉధృతం చేస్తామన్నారు.
మరోవైపు ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లాలో ఆందోళన నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లు, వైద్యవిద్యార్థుల తీరుపై జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల్లో జూడాలు విధుల్లోకి తిరిగి చేరాలని... తమ ఆదేశాలు బేఖాతరు చేసిన పక్షంలో వారిని యూనివర్సిటీకి అప్పగిస్తామని హెచ్చరించారు. వైద్యవిద్యార్థులు తిరిగి తరగతులకు హాజరుకావాలని సూచించారు. 48గంటల్లో జూడాలు, మెడికోలు తమ నిర్ణయాన్ని పాటించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి.