భాజపా, జనసేన స్నేహం.. రాష్ట్ర ప్రజలకు ఉపయోగకరమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు తిరుపతి చేరుకున్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలిస్తోందని విమర్శించారు. ఈ తీరును ఎండగట్టేందుకే జనసేన, భాజపా కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అమరావతి రైతులకు తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. విభజన చట్టంలోని హామీలు అమలయ్యేలా తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి: