ETV Bharat / city

'అమరావతి... సొంత కాళ్లపై సగర్వంగా నిలిచే రాజధాని' - three capitals for AP news

ఎవరైనా తమ ఇంటికి సంపద నడిచి వస్తుంటే వద్దంటారా? వారి ఆర్థిక ముఖచిత్రాన్ని సచిత్రంగా మార్చేసే పరిణామం చోటు చేసుకుంటుంటే పట్టనట్లు ఉంటారా? ఉండరు కదా...కానీ... రాష్ట్రంలోని వైఖరి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క పైసా ఖర్చు లేకుండానే రూ.లక్ష కోట్ల విలువైన రాజధాని నగర నిర్మాణం చేపట్టే అవకాశం కళ్లముందు సాక్షాత్కరిస్తున్నా దాన్ని వదులుకుంటున్నాం. సొంత కాళ్లపై నిలబడే స్వయం సమృద్ధి ప్రాజెక్టును కాలదన్నుకుంటున్నట్లుగా ఉంది ఈ వైఖరి. పైగా ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర ప్రగతికి విఘాతం కలిగించేలా రాజధాని తరలింపు మాటలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ట్ర్ర రాజధాని అమరావతి నగర నిర్మాణం, దానికయ్యే ఖర్చును సమకూర్చుకునే విధానం, సిద్ధమైన ప్రణాళికలు, అమలులో ఉన్న కార్యాచరణ తదితర అంశాలపై ప్రత్యేక కథనం

no-need-to-amount-spent-on-capital-city-amravati

author img

By

Published : Jan 18, 2020, 5:12 AM IST

Updated : Jan 18, 2020, 6:43 AM IST

రాజధాని అమరావతి నగర నిర్మాణానికి రూ.1.09 లక్షల కోట్లు కావాలి! అవును నిజమే... కావాలి.
కానీ... అంత డబ్బు ఎప్పటికి కావాలి?
మొత్తం డబ్బు ఇప్పటికిప్పుడే పెట్టాలా?
అంతా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేయాలా?
ఆ అవసరమే లేదు.
రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం, మాట సాయం చేస్తే చాలు. అమరావతి తన కాళ్లపై తానే ఎదుగుతుంది. భూముల విక్రయం, రుసుములు, పన్నుల రూపంలో వచ్చే ఆదాయంతో నగరం తనను తానే నిర్మించుకుంటుంది. ప్రభుత్వం మొదట్లో ఆర్థిక సాయంగా ఇచ్చిన డబ్బునీ తిరిగిచ్చేస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తుంది.

'అమరావతి... సొంత కాళ్లపై సగర్వంగా నిలిచే రాజధాని'

అమరావతి పూర్తిగా స్వయం సమృద్ధి ప్రాజెక్టు. రైతులు భూ సమీకరణలో ఇచ్చిన, అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భూములు, అతి తక్కువ సమయంలో అంతర్జాతీయంగా వచ్చిన బ్రాండ్‌ ఇమేజ్‌లే నగరానికి పెట్టుబడి!
...ఇదేదో రాష్ట్ర ప్రభుత్వ విభాగమో, సంస్థో వేసిన అంచనా కాదు. ప్రముఖ కన్సల్టెన్సీ, రేటింగ్‌ సంస్థలు సీఆర్‌డీఏ ఆర్థిక పరిస్థితి, అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌, అక్కడి భూములకు భవిష్యత్తులో రానున్న గిరాకీని మదింపుచేసి చెప్పిన నిజాలివి. రాజధానిలో ఎకరం భూమి కనీస విలువ రూ. 10 కోట్లు ఉన్నట్లు హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే తేటతెల్లమైంది.

ఎంత కావాలి?

వివిధ కన్సల్టెన్సీ, రేటింగ్‌ సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం రాజధాని నగర నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు రూ. 1.09 లక్షల కోట్లు. ఇందులో సీఆర్‌డీఏ చేయాల్సిన ఖర్చు దశల వారీగా రూ.55,343 కోట్లు. మిగతా రూ.54 వేల కోట్లు రాజధాని నిర్మాణంలో భాగంగా రాబోయే కొన్నేళ్లలో చేపట్టే వివిధ పీపీపీ ప్రాజెక్టుల్లో, ఇతరత్రా చేయాల్సిన వ్యయం. ఇందులో ప్రైవేటు సంస్థల పెట్టుబడే ఎక్కువ.

ప్రభుత్వాన్ని కోరింది రూ.12,600 కోట్లే!

  • నగర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లలో (2018-19 నుంచి 2025-26 మధ్య) ప్రభుత్వ వాటా (ఈక్విటీ), సపోర్టింగ్‌ గ్రాంట్‌ రూపంలో రూ.12,600 కోట్లు ఇవ్వాలని సీఆర్‌డీఏ కోరింది.
  • దీనిలో మొదటి సంవత్సరం రూ.500 కోట్లు, అక్కడి నుంచి ఆరేళ్లపాటు ఏటా రూ.1,800 కోట్లు, చివరి సంవత్సరం రూ.1300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే సరిపోతుంది.
  • ఈ మొత్తంలో ప్రభుత్వ ఈక్విటీ రూ.6,629 కోట్లు. సపోర్టింగ్‌ గ్రాంట్‌ రూ.5,971 కోట్లు.
  • రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని 2037 తర్వాత సీఆర్‌డీఏ తిరిగి చెల్లించేలా ఆర్థిక ప్రణాళిక రూపొందించారు.
  • ఈ లెక్కన చూసినా... ప్రాథమికంగా ఇచ్చే మద్దతే తప్ప, ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రాజధానిపై ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.
  • వివిధ సంస్థల నుంచి రుణాలు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీలు మాత్రం కావాలి. ప్రాజెక్టుల వారీగా వాటికి ప్రభుత్వం గ్యారంటీలు ఇస్తూ వచ్చింది.

నిర్మాణ రంగం నుంచే ఏడాదికి సుమారు రూ.12 వేల కోట్ల రాబడి

నిర్మాణరంగంలో పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడికి, నాలుగింతలుగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని అంచనా. ఆ లెక్కన రాజధాని నగర ప్రాంతంలో ముమ్మరంగా నిర్మాణాలు జరిగితే ఇక్కడి నుంచి ఏటా జీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో రూ.12 వేల కోట్లు వస్తుందని సీఆర్‌డీఏ వర్గాలు ఒక దశలో అంచనా వేశాయి. ఇందులో నుంచి రాష్ట్ట్ర్ర ప్రభుత్వ వాటా(ఎస్‌జీఎస్టీ) రూ.6 వేల కోట్లు ఉంటుంది. భూములు, స్థలాల రిజిస్ట్రేషన్‌ రుసుంల ద్వారా రాష్ట్రానికి అదనంగా రాబడి ఉంటుంది. వీటిని తమకిస్తే చాలని సీఆర్‌డీఏ కోరింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. తమపై ఆధారపడకుండా, అమరావతిని పూర్తిగా స్వయం సమృద్ధి ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని స్పష్టం చేసింది. దాంతో ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆర్థికసాయం చేస్తే, భూముల ధరలు పెరిగాక వాటిని విక్రయించి ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తామని సీఆర్‌డీఏ ప్రతిపాదించగా ప్రభుత్వం అంగీకరించింది.

బ్రాండ్‌ ఇమేజ్‌ పెద్ద వరం

అమరావతికి చాలా తక్కువ సమయంలోనే అంతర్జాతీయంగా బ్రాండ్‌ ఇమేజ్‌ లభించింది. ఈ ప్రాజెక్టులో పాలు పంచుకునేందుకు పలు దేశాలు ఆసక్తి కనబరిచాయి. స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు చేపట్టేందుకు సింగపూర్‌ ముందుకు వచ్చింది. మసాలా బాండ్లు విడుదల చేసేందుకు లండన్‌ స్టాక్‌ ఎక్ఛేంజి సంసిద్ధత వ్యక్తంచేసింది. జపాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, చైనా వంటి సంస్థలు రాజధాని ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకొచ్చాయి.

అవసరమైన నిధులు రూ.37,112 కోట్లు
రాజధాని నిర్మాణానికి వాణిజ్య బ్యాంకుల నుంచి, ప్రపంచబ్యాంకు వంటి సంస్థల నుంచి దీర్ఘకాలిక రుణాలు తీసుకోవడం వంటి ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పటికే హడ్కో రూ.1275 కోట్లు, మూడు బ్యాంకుల కన్సార్షియం రూ.2060 కోట్లు మంజూరు చేశాయి. బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్లు సమకూరింది. ప్రపంచబ్యాంకు, ఏఐఐబీ కలసి తొలి విడతలో రూ.3,603 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ప్రక్రియ అంతా కొలిక్కి వచ్చే దశలో రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేయడంతో ప్రపంచబ్యాంకు రుణ ప్రతిపాదన రద్దు చేసుకుంది. ఏఐఐబీ కూడా వెనక్కు వెళ్లిపోయింది. అది ఆచరణలోకి వస్తే కేవలం 4 శాతం లోపు వడ్డీకే రుణం లభించేది. అది కూడా 20-30 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సిన రుణం కాబట్టి సీఆర్‌డీఏపై పెద్దగా భారమూ ఉండేది కాదు.

రూ. 1.86 లక్షల కోట్ల ఆదాయం

  • అమ్మకానికి సిద్ధం చేసే భూమి: 5,020 ఎకరాలు
  • ఇందులో 3,709 ఎకరాల్ని 2023 నుంచి దశలవారీగా విక్రయం ప్రారంభిస్తారు. దీంతో 18 ఏళ్లలో ఆదాయ అంచనా: రూ.78,563 కోట్లు
  • మిగతా 1,311 ఎకరాల్ని 2037 తర్వాత విక్రయిస్తారు. ఆదాయ అంచనా: రూ.92,950 కోట్లు
  • రాజధాని నుంచి సీఆర్‌డీఏకి పన్నులు తదితర ఆదాయం: రూ.14,641 కోట్లు
  • ఈ ప్రణాళిక అనుకున్నట్టు అమలు జరిగితే 2037 నాటికి ప్రాజెక్టు వ్యయం పోగా సీఆర్‌డీఏకి నికరంగా మిగిలేది: రూ.33,304 కోట్లు
  • ప్రభుత్వం ఇచ్చిన రూ.12,600 కోట్లను కూడా ఈ నిధుల నుంచి తిరిగి చెల్లిస్తారు.
  • రాజధానిలోని చాలా విలువైన వాణిజ్య స్థలాలను సీఆర్‌డీఏ తన కోసం అట్టిపెట్టుకుంది. వాటిలో భవిష్యత్తులో వాణిజ్యపరంగా ఎక్కువ ధర వచ్చే రహదారులను ఆనుకుని, కూడళ్లలో వాణిజ్య విలువ ఎక్కువగా ఉండే స్థలాలు ఉన్నాయి.

హ్యాపీనెస్ట్‌ భూమి విలువే ఎకరం రూ.10 కోట్లు

రాజధానిలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు సీఆర్‌డీఏ యాంకర్‌ ప్రాజెక్టుగా ‘హ్యాపీనెస్ట్‌’ పేరుతో గృహనిర్మాణం చేపట్టింది. నేలపాడు సమీపంలో సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో 1,200 ఫ్లాట్లు నిర్మించి ప్రజలకు విక్రయించడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్టుకి కేటాయించిన భూమి విలువను సీఆర్‌డీఏ ఎకరం రూ.10 కోట్లుగా లెక్కించి, ప్రాజెక్టు వ్యయ అంచనాలు రూపొందించింది. అంటే ఆ ప్రాజెక్టు పూర్తయితే ఎకరానికి రూ.10 కోట్ల చొప్పున... సీఆర్‌డీఏకి భూమి విలువ రూపంలో రూ.150 కోట్లు వస్తుంది. భూమి విలువ ఎకరం రూ.10 కోట్లు నిర్ణయించిన తర్వాత కూడా, హ్యాపీనెస్ట్‌లో ఫ్లాట్‌లను సీఆర్‌డీఏ బహిరంగ మార్కెట్‌ విలువతో పోలిస్తే ఒక్కో చదరపు అడుగు రూ.వెయ్యి కంటే తక్కువకే ఇచ్చింది. ఈ తరహా గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో బహిరంగ మార్కెట్లలో ఒక ఫ్లాట్ ధర రూ.45 లక్షలు ఉందనుకుంటే, సీఆర్‌డీఏ రూ.35 లక్షలకే ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు నిర్వహించగా... దేశ, విదేశాల నుంచి వేలాది మంది పోటీపడ్డారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఫ్లాట్లన్నీ బుక్కయిపోయాయి. అంటే రాజధానిలో ప్రాజెక్టులకు గిరాకీ ఉన్నట్టే కదా..!

మరికొన్ని ఉదాహరణలు

  • రాజధాని ప్రకటన వెలువడగానే అక్కడి భూముల ధరలు పైకెగిశాయి. భూసమీకరణ ప్రక్రియ మొదలు పెట్టకముందే ఎకరం రూ.కోటి దాటేసింది. భూసమీకరణ సమయంలో మెట్ట భూముల ధర ఎకరం రూ.1.80 కోట్లకు, జరీబు భూములు ఎకరం రూ.2.60 కోట్లకుపైగా ధర పలికాయి. సీఆర్‌డీఏ స్థలాలు కేటాయించాక... కొందరు రైతులు గరిష్ఠంగా చదరపు గజం రూ.38-40 వేలకు విక్రయించారు. మౌలిక వసతుల కల్పనకు ముందే ధరలు ఇలా ఉంటే, వసతులన్నీ పూర్తి చేసి, నిర్మాణాలు ఊపందుకుంటే, ధరలు కచ్చితంగా ఊహించినదానికంటే అధికంగా పెరుగుతాయి.
  • విజయవాడ, గుంటూరు మధ్య జాతీయ రహదారికి అటూ ఇటూ భూముల ధరలు గరిష్ఠంగా ఎకరం రూ.15 కోట్ల వరకు పలుకుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్న రాజధానిలో భూముల ధరలు త్వరలో ఆ స్థాయికి చేరడం అతి సాధారణం.
  • ఈ ప్రాజెక్టు ద్వారా రెండు విషయాలు స్పష్టంగా బోధ పడుతున్నాయి.

1 రాజధానిలో ఇప్పటికే ఎకరం భూమి విలువ రూ.10 కోట్లకు చేరింది.
2 భూమి ధర ఆ మేరకు నిర్ణయించినా, ప్రాజెక్టు లాభ దాయకంగానే ఉంది.

లక్ష కోట్ల ఆస్తి

సీఆర్‌డీఏ చేతిలో ఉన్న 8,274 ఎకరాలే కాకుండా... అమరావతి ఆర్థిక నగరంలో అంకుర ప్రాంత (స్టార్టప్‌ ఏరియా) అభివృద్ధి ప్రాజెక్టుకి సీఆర్‌డీఏ 1691 ఎకరాలను కేటాయించింది. సింగపూర్‌ సంస్థల కన్సార్షియంతో కలిసి ఏడీసీ సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని అమలు చేయాలన్నది ప్రతిపాదన. స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. అంటే ప్రస్తుతం సీఆర్‌డీఏ చేతిలో ఈ 1691 ఎకరాలు కలిపి సుమారు 10 వేల ఎకరాల ల్యాండ్‌బ్యాంకు ఉన్నట్టే. ఈ 10 వేల ఎకరాల్ని సక్రమంగా వినియోగించుకుంటే... నిధుల కోసం ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేకుండా అమరావతి నగర ప్రాజెక్టుని పూర్తి చేయవచ్చు. రాజధానిలో భూమి విలువ కనీసం ఎకరం రూ.10 కోట్లు వేసుకున్నా, ప్రభుత్వం దగ్గర రూ.లక్ష కోట్ల ఆస్తి ఉన్నట్టే!
రూ.15 వేల కోట్లు కేటాయిస్తే..

  • ఇటీవల ప్రభుత్వం ముందుంచిన ప్రతిపాదన ప్రకారం.. మూడేళ్లలో రూ.15 వేల కోట్లు ఇస్తే... సగంలో ఉన్న రహదారులు, పూర్తి కావస్తున్న నివాస భవనాల నిర్మాణం, రైతులకు ఇచ్చిన లేఅవుట్‌లలో మౌలిక వసతుల అభివృద్ధి పూర్తి చేస్తామని సీఆర్‌డీఏ చెప్పింది.
  • తొలుత విక్రయానికి నిర్దేశించిన 5 వేల ఎకరాలను రూ.5 కోట్ల చొప్పున విక్రయించినా రూ.25 వేల కోట్ల ఆదాయం వస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన రూ.15 వేల కోట్లను తిరిగి చెల్లించడంతో పాటు, తామే ప్రభుత్వానికి మరో రూ.10 వేల కోట్లు అదనంగా ఇవ్వగలమని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది.

దీనిలో వాస్తవం ఎంత?

రాజధాని అమరావతి ప్రణాళికలోని మౌలిక సూత్రం.. దాన్ని స్వయం సమృద్ధి ప్రాజెక్టుగా తీర్చిదిద్దడం. ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టకుండా, రైతుల నుంచి భూములను సమీకరించి, అభివృద్ధిలో వారిని భాగస్వాముల్ని చేస్తూ, తన వాటాకు వచ్చే భూమిని సీఆర్‌డీఏ విక్రయించి రాజధానిని నిర్మిస్తే తప్పేముంది? అది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమైతే? వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ భూములు విక్రయించడాన్ని ఏమనాలి? అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వాలు భూములు విక్రయించడం కొత్తేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెటరీ సపోర్టు పేరిట ప్రభుత్వాలు భూములను విక్రయించాయి.

పెద్ద ఎత్తున ప్రైవేట్‌ పెట్టుబడులు

  • రాజధానిలో సీఆర్‌డీఏ ప్రధాన మౌలిక వసతులు కల్పించి, భూములిచ్చిన రైతులకు స్థలాలను లేఅవుట్‌ చేసి ఇస్తే చాలు... తాము అమరావతిలో పెట్టుబడులు పెడతామంటూ అనేక సంస్థలు ముందుకు వచ్చాయి. వివిధ యూనివర్సిటీలు, పాఠశాలలు, ఆతిథ్య, వినోదరంగాలకు చెందిన సంస్థలు పోటీపడ్డాయి. ఎస్‌ఆర్‌ఎం, విట్‌ యూనివర్సిటీలు రెండేళ్ల నుంచే తరగతులు నిర్వహిస్తున్నాయి. అమృత వర్సిటీ భవనాల పనులు సాగుతున్నాయి.
  • స్టార్‌ హోటళ్లు, అంతర్జాతీయ, జాతీయ పాఠశాలలు, వినోద, పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు చాలా సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. వాటికి భూ కేటాయింపులూ జరిగాయి.
  • రాజధాని నగర నిర్మాణమంటే పూర్తిగా ప్రభుత్వ పెట్టుబడులతోనే చేయాల్సిన పనిలేదు. ఇక్కడ ఇప్పటి వరకు ఒప్పందాలు, భూకేటాయింపులు జరిగిన ప్రైవేటు ప్రాజెక్టుల విలువే రూ.45 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.
  • రాజధానిలో రైతులకు స్థలాల రూపంలో కేటాయించిన భూమి విస్తీర్ణం 11,826 ఎకరాలు. వాటిలోనూ పెద్ద ఎత్తున నివాస, వాణిజ్య ప్రాజెక్టులు వస్తాయి.
  • అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఒకపక్క సీఆర్‌డీఏ ప్రధాన మౌలిక వసతుల నిర్మాణం పూర్తి చేస్తే, దానికి సమాంతరంగా పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులూ వచ్చి... రాబోయే కొన్నేళ్లలోనే అమరావతి ఒక పూర్తిస్థాయి, స్వయం సమృద్ధి నగరంగా రూపు దిద్దుకుంటుంది.

ఇదీ చదవండి : నేటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా

Last Updated : Jan 18, 2020, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.