తిరుమల శ్రీవారి తల్లిగా పూజలు అందుకునే వకుళమాత ఆలయంలో చారిత్రక శాసనం ఒకటి బయట పడింది. తిరుపతి సమీపంలోని పేరూరు గ్రామంలో వకుళమాత ఆలయ అభివృద్ధి పనుల్లో ఈ పురాతన శాసనం వెలుగు చూసింది. ఈ శాసనాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు 11వ శతాబ్దంలో తమిళంలో నాటి చోళ రోజు మొదటి కులోత్తంగ చోళుడు జారీ చేసిన శాసనంగా గుర్తించారు.
ఈ శాసనం ఆధారంగా ఇక్కడే విష్ణుమూర్తి అలయంతో పాటు, అమ్మవారి ఆలయం ఉన్నట్లు చెబుతున్నారు. తితిదేలో వకుళమాత ఆలయానికి సంబంధించి..గతంలో శాసన ఆధారాలు దొరకని పక్షంలో... ఈ శాసనంపై పురావస్తు శాఖ అధికారులు మరింత లోతుగా పరిశోధనలు జరుపుతున్నారు.
ఇదీ చదవండి