తిరుమల ఏడు కొండల స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కిలోమీటరు మేర క్యూలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులు 5 గంటలు వేచి ఉంటున్నారు. నిన్న శ్రీవారిని 81 వేల 195 మంది భక్తులు దర్శించుకోగా.. 34 వేల 630 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం సోమవారం నాడు 3 కోట్ల 38 లక్షల రూపాయలుగా నమోదైంది.
ఇదీ చదవండి