చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి ప్రవాస భారతీయ అజ్ఞాత భక్తుడు రూ.7 కోట్ల విరాళం అందజేశారు. విరాళం చెక్కును అజ్ఞాత భక్తుడి తరఫున కుటుంబసభ్యులు శనివారం ఆలయ ఈవో ఎ.వెంకటేశుకు అందజేశారు. ప్రస్తుతం ఉన్న స్వామివారి ఆలయం పురాతనమైనది కావడంతో పునర్నిర్మాణానికి రూ.8.75 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు.
ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చేందుకు ప్రవాస భారతీయ అజ్ఞాత భక్తుడు ముందుకొచ్చారు. శనివారం మొదటి విడతగా రూ.7కోట్ల చెక్కును ఆలయ ఈవోకు అందజేశారు. మిగిలిన నిధులను ఆ భక్తుడే సమకూర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరతాం: తితిదే