కుప్పంకు 50 కిలోమీటర్ల దూరంలోని.. కందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హెలికాఫ్టర్ అత్యవసరంగా పొలాల్లో దిగింది. కోయంబత్తూర్కు చెందిన ఓ నగల వ్యాపారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకన్న దర్శనం కోసం హెలికాఫ్టర్లో బయలుదేరారు. అయితే వాతావరణం అనుకూలంగా లేనందున అత్యవసరంగా పొలాల్లో దించారు. దీనిని చూసేందుకు జనం ఎగబడ్డారు. రెండు గంటల అనంతరం హెలికాఫ్టర్ బయలుదేరి తిరుపతికి పయనమైంది.
ఇదీ చదవండి :