చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో పది రోజులుగా భారీ వర్షాలు కురవటంతో నదులు, వాగులు, వంకలు, సెలయేర్లు పొంగి ప్రవహిస్తున్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో పెద్ద సాగునీటి ప్రాజెక్టు పెద్దేరు జలాశయం సగం నీటితో నిండింది. చిన్నేరు జలాశయం పూర్తిగా నిండింది.
కర్ణాటక నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గం మీదుగా ప్రవహించి కడప జిల్లా గాలివీడు జలాశయానికి చేరుకుని పెద్దేరు జోరుగా ప్రవహిస్తోంది. మదనపల్లి డివిజన్ పరిధిలో 3000 లకు పైగా సాగునీటి వనరులు చెరువులు, కుంటలు జలకళని సంతరించుకున్నాయి.
ఇదీ చూడండి : గోదారి... ఈసారీ ముంపుదారి!