ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు ప్రవహిస్తోంది. మూడేళ్ల తర్వాత నదికి నీరు చేరటంతో స్థానికులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఆలయానికి చేరుకునే భక్తులు నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.
ఇదీ చూడండి: 'రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు'