సంక్షేమ పథకాల అనర్హులను అర్హుల జాబితాలో చేర్చాలంటూ వత్తిడి చేసి వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలంటూ చిత్తూరు జిల్లాలో ఓ సచివాలయ ఉద్యోగి వాపోయారు. పెద్దమండ్యం సచివాలయ ఉద్యోగిగా రాజేంద్ర విధులు నిర్వర్తిస్తున్నారు. 71 ఏళ్ల వ్యక్తిని వృద్ధాప్య పింఛన్ జాబితాలోకి చేర్చవద్దంటూ స్థానిక ఎంపీటీసీ తనపై వత్తిడి తెచ్చారని రాజేంద్ర ఆరోపించారు. సదరు వ్యక్తిని పింఛన్ జాబితాలో చేర్చటం వల్ల మండల అభివృద్ధి అధికారితో కలిసి తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపీడీవో, ఎంపీటీసీ చెప్పినట్లు తాను వినకపోవడం వల్ల జిల్లా సంక్షేమ కార్యాలయానికి సరెండర్ చేశారని తెలిపారు. నవంబర్ 25న సరెండర్ చేసినట్లు ఉత్తర్వులు ఇచ్చి అవి ఈ రోజు తనకు అందచేశారని రాజేంద్ర ఆరోపించారు. తనకు న్యాయం జరిగే వరకు అండగా ఉండాలని మీడియాను కోరారు.
ఇదీ చదవండి: